Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదురై రైల్వే స్టేషన్‌లో పర్యాటక రైలులో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి?

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (09:20 IST)
ఆలయాల నగరంగా ప్రసిద్ధిగాంచిన తమిళనాడు రాష్ట్రంలోని మదురైలోని రైల్వే స్టేషన్‌లో ఆగివున్న పర్యాటక రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ రైలులోని ప్యాంట్రీకార్‌లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 10 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. మరికొందరు గాయపడ్డారు. 
 
లక్నో నుంచి రామేశ్వరం ప్రాంతాలను కలుపుతూ రైల్వే శాఖ పర్యాటక రైలును నడుపుతుంది. ఈ రైలు మదురై స్టేషన్‌కు వచ్చి ఆగింది. శనివారం ఉదయం రైలులోని ప్యాంట్రీకార్‌లో వంట పనుషులు తేనీరు పెట్టేందుకు గ్యాస్ స్టౌ వెలిగించారు. ఆ సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో తొలుత ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చినప్పటికి ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని మదురై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments