యువతికి టీలో మత్తుమందు ఇచ్చి మూడేళ్ల పాటు..?

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (17:13 IST)
యువతికి టీలో మత్తుమందు కలిపి ఇచ్చి మూడేళ్ళ పాటు అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. ఈ ఘటన ముంబై మహానగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 35 ఏళ్ల వ్యక్తికీ సోషల్ మీడియాలో ఓ యువతి పరిచయమైంది. కొద్దికాలానికి ఇద్దరు మంచి స్నేహితులయ్యారు.
 
ఒకరోజు యువతిని ఆహ్వానించి.. అతిధి మర్యాదగా యువతికి టీ ఇచ్చాడు. అయితే అందులో మత్తుమందు కలిపాడు.. ఆ టీ తాగిన యువతి సృహతప్పి పడిపోయింది. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
మత్తు వీడిన తరువాత స్పృహలోకి వచ్చిన యువతి అసలు విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో సదరు వ్యక్తి ఆమెను అడ్డుకున్నాడు.. ఓ వీడియో చూపించాడు.. దీంతో యువతి షాక్‌కి గురైంది. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఆ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించాడు.
 
దీంతో యువతి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. వీడియో డిలీట్ చెయ్యాలని బ్రతిమాలింది అయినా అతడు వినలేదు. వీడియోను అడ్డంపెట్టుకొని అనేక సార్లు యువతిపై లైంగికదాడి చేశాడు.
 
కొన్నిసార్లు మళ్లీ వీడియో తీసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. శారీరకంగా హింసించాడు. దీంతో వేధింపులు తట్టుకొని యువతి కుటుంబ సభ్యులకు తెలిపింది. 
 
వారు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. విచారణలో తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం