కోవిడ్ 19 కారణంగా ఆర్థికంగా చితికిపోతాయేమోనని.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కానీ బజాజ్ ఆటో కంపెనీ మాత్రం ఉద్యోగులను ఆదుకుంటోంది. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కరోనాబారిన పడి మరణిస్తే.. వారి కుటుంబాలకు రెండేళ్లవరకు వేతనాలు చెల్లిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది.
అంతేకాకుండా పిల్లల చదువు బాధ్యత కూడా ఆ కంపెనీయే చూసుకోనుంది. రెండు సంవత్సరాలపాటు అంటే.. 24 నెలలపాటు.. మరణించిన ఉద్యోగి కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు వేతనాలు చెల్లిస్తామని బజాజ్ ఆటో కంపెనీ లింక్డ్ ఇన్ పోస్ట్‌లో తెలిపింది.
ఇక పిల్లల విషయానికిస్తే....12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ఆ సంస్థ పేర్కొంది. అలాగే గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలకు ఏడాదికి రూ. 5 లక్షలు అందిస్తామని తెలిపింది. పర్మినెంట్ ఉద్యోగులు అందరికీ.. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ బెనిఫిట్ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.