Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై నటికి వేధింపులు.. నటి చేతికి పట్టుకుని..?

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (09:59 IST)
మహిళలపై ఎక్కడపడితే అక్కడ వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ నటికి నడిరోడ్డుపై వేధింపులు ఎదురయ్యాయి. మద్యం మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్ ఈ చర్యకు ఒడిగట్టాడు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బాధిత మహిళను మరాఠి సినీ పరిశ్రమకు చెందిన నటిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల మరాఠి నటి పలు చిత్రాల్లో నటించింది. ఆమె గోరేగావ్ పశ్చిమ ప్రాంతంలో నివాసం ఉంటుంది. 
 
శుక్రవారం సాయంత్రం ఆమె తన పిల్లలతో కలిసి బయటకు వెళ్లింది. అయితే ఆమె తిరిగి ఇంటికి బయలుదేరగా.. గోరేగావ్‌లోని ఓ ఆస్పత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కూడలి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారుకు మరో కారు అడ్డుగా వచ్చింది. దాదాపు రెండు కార్లు ఢీకొన్నంత పని అయింది. అవతలి కారులో నిందితుడు ప్రీతమ్ వర్మ, అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. 
 
అయితే కార్లు ఒకదానికొకటి ఎదురుపడటంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు కూడా కార్లు వెనక్కి తీసేందుకు అంగీకరించకపోవడంతో.. వారి మద్య మాటల యుద్దం ఏర్పడింది. ఈ క్రమంలో నటి నిందితుడిని ఎదుర్కొవడానికి ప్రయత్నించినప్పుడు మద్యం మత్తులో ఉన్న అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. నటి చేతిని పట్టుకుని వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ప్రీతమ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments