Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో విరిగిపడుతున్న కొండచరియలు - చిక్కుకున్న యాత్రికులు

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (13:16 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరోమారు కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీగా కొండచరియలు విరిగిపడటంతో 300 మంది మంది ప్రయాణికులు ఘాట్ రోడ్లపై చిక్కుకుపోయారు. వాటి వల్ల రాష్ట్రంలోని పితోరాగఢ్‌ జిల్లాలోని లఖన్‌పుర్ సమీపంలోని లిపులేఖ-తవఘాట్‌ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకల కోసం రెండు రోజుల తర్వాత ఈ రోడ్డును తెరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు ఈసారి భారీసంఖ్యలో భక్తులు పోటెత్తారు. మంచుకొండల్లో ప్రయాణానికి అక్కడక్కడా వీరికి కొంత అసౌకర్యం కలుగుతున్నప్పటికీ వారు లెక్క చేయడం లేదు. నవంబరు రెండో వారం వరకూ ఈ యాత్ర కొనసాగనుంది. ఈ సమయంలో కొండచరియలు విరిగిపడటం ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 
 
అల్మోరా, చమోలీ, చంపావత్‌, దేహ్రాదూన్‌, హరిద్వార్‌, గర్వాల్‌, నైనిటాల్‌, రుద్రప్రయాగ, తెహ్రీ గర్వాల్‌, పితోరాగఢ్‌, ఉద్దమ్‌ సింగ్ నగర్‌, ఉత్తరకాశీ జల్లాల్లో తుపాన్‌, ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయని తెలిపింది. అలాగే యాత్రికులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments