Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధువులను వదలని కరోనా.. 30 మందికి కోవిడ్ పాజిటివ్

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (10:06 IST)
కరోనా వైరస్ సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్న సాధువులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 30 మంది సాధువులకు కరోనా సంక్రమించినట్లు తేలింది. ఈ విషయాన్ని హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్‌కే జా తెలిపారు. 
 
అఖాడాలకు వైద్య బృందాలు వెళ్తున్నాయని, అక్కడ ఉండే సాధువులకు ఆర్‌సీ పీసీఆర్ పరీక్షలు నిరంతరం చేస్తున్నారన్నారు. హరిద్వార్‌లో క్రిటికల్‌గా ఉన్న కేసులను రిషికేశ్‌లో ఉన్న ఎయిమ్స్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ప్రజలను మాత్రం హోం ఐసోలేషన్‌లోకి పంపిస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హాస్పిటల్‌లో చేర్పిస్తున్నారు. హరిద్వార్‌లో ఉన్న హాస్పిటళ్లలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితి లేదన్నారు.
 
హరిద్వార్‌లో గురువారం ఒక్క రోజే 600 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అక్కడ ఉన్న నిరంజనీ మఠం ఈ నేపథ్యంలో ఓ హెచ్చరిక జారీ చేసింది. కుంభమేళాలో పాల్గొంటున్న సాధువులంతా వెళ్లిపోవాలంటూ పేర్కొంది. 
 
నిరంజనీ అఖారా కార్యదర్శి రవీంద్ర పురి మాట్లాడుతూ.. పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల హరిద్వార్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, గంగా నదిలో పుణ్యం స్నానం చేసిన సాధువులంతా తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలంటూ కోరామని చెప్పారు. హరిద్వార్‌లో సుమారు 13 అఖారాలు ఉన్నాయి. వాటిల్లో లక్షలాది మంది సాధువులు ఉంటున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments