Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత ఇల్లు కొన్నాడు.. అంతే షాకయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే..?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (21:58 IST)
హర్యానాలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. రెండున్నరేళ్ల క్రితం ఓ పాత ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తికి షాక్ తప్పలేదు. ఆ ఇంటిని పునర్మించే క్రమంలో అస్థిపంజరాలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని పానిపట్ శివనగర్ కాలనీలో ఓ ఇంట్లో పునర్ నిర్మాణ పనులు జరిగేటప్పుడు మూడు అస్థి పంజరాలను గుర్తించారు. వికాస్ కుమార్ అనే వ్యక్తి రెండున్నర సంవత్సరాల క్రితం ఒక పాత ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి సంబంధించి కొంతభాగం రోడ్డుపై ఉండటంతో దానిని తీసివేసి పునర్నిర్మించాలని మరమ్మతు పనులను చేపట్టాడు. 
 
అయితే మరమ్మతు పనులు చేసేటప్పుడు ఇంట్లోని ఒక మూల నుంచి కీటకాలు కుప్పలు కుప్పలుగా బయటికి వస్తున్నాయి. అయితే వాటిని చూసి కొంతకాలం ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే నిర్మాణంలో భాగంగా తవ్వకాలు చేస్తున్నప్పుడు కీటకాలను చూసిన వ్యక్తులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని భావించారు. అవి బయటికి వస్తున్న స్థలం దగ్గర తవ్వేసరికి అక్కడ మూడు మానవ అస్తి పంజరాలను కనుగొన్నారు. వెంటనే భయబ్రాంతులకు గురైన వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
 
అందులో భాగంగా ఇంటి యజమాని కుమార్‌ని ప్రశ్నించగా తాను రెండున్నర సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కొన్నానని అంతకు ముందు ఈ ఇంటిని మరో ఇద్దరు కొనుగోలు చేశారని అంతకు మించి తనకు ఏ విషయాలు తెలియదని చెప్పాడు. అసలు అక్కడికి అస్థి పంజరాలు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిఫుణుల సహాయంతో అస్థిపంజరాలపై పరీక్షలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments