Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోల్ ప్లాజా వద్ద ఆగివున్న కార్లను ఢీకొట్టిన ఇన్నోవా.. ముగ్గురి మృతి

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (09:18 IST)
టోల్ ప్లాజా వద్ద ఘోరం జరిగింది. ఈ టోల్ ప్లాజాలో ఆగివున్న కార్లను ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. అలాగే, ప్రమాదంలో మొత్తం ఆరు వాహనాలు దెబ్బతిన్నాయి. ముగ్గురు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం రాత్రి జరిగింది. 
 
టోల్ ప్లాజా వద్ద ఆగివున్న పలు వాహనాలను అతివేగంగా దూసుకొచ్చిన ఓ ఇన్నవో కారు ఢీకొట్టింది. గురువారం రాత్రి వర్లీ నుంచి బాంద్రా వైపు వెళుతున్న ఇన్నోవా కారు ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు వెల్లడించారు. సీ లింకులో ఉన్న టోల్ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్ కారును ఢీకొట్టింది. 
 
ఆ తర్వాత మరో రెండు మూడు వాహనాలను ఢీకొట్టిందని డీసీపీ కృష్ణకాంత్ ఉపాధ్యాయ వెల్లడించారు. మెర్సిడెస్, ఇన్నోవా సహా మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయని వివరించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు ఆయన తెలిపారు. 
 
కారు డ్రైవర్ అతివేగం.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది... 
 
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వాలతో పాటు ట్రాఫిక్ పోలీసులు ఎన్నో రకాలైన సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అయినప్పటికీ వాహనచోదకులు అతివేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. తద్వారా తాము ప్రమాదాలకు గురికావడమే కాకుండా, ఎదుటివారిని కూడా కష్టాలకు గురిచేస్తుంటారు. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలైపోతున్నారు. తద్వారా అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. 
 
తాజాగా ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి తండ్రీకూతుళ్లు ప్రాణాలు విడిచారు. ఈ షాకింగ్ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా షేర్ చేశారు. గుజరాత్లో ఇటీవల జరిగిన భయానక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇది. ఆనంద్ ప్రాంతంలో ఓ కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అతివేగంగా వెళుతూ ఎదురుగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో బైకుపై ఉన్న భార్యాభర్తలు వారి ఐదేళ్ల కుమార్తె ఒక్కసారిగా గాల్లో ఎగిరిపడ్డారు. తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, తల్లికి తీవ్ర గాయాలయ్యాయని సజ్జనార్ తెలిపారు. అతివేగం తెచ్చిన అనర్థం ఇదంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments