Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం : ఎన్నికల ప్రచారం చేస్తుండగా బీజేపీ నేత హత్య

murder
, ఆదివారం, 5 నవంబరు 2023 (16:25 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానిక బీజేపీ నాయకులను ఆందోళనకు గురిచేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నారాయణ్‌పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్ దూబే.. జిల్లాలోనే కౌశాల్నర్ గ్రామంలో పార్టీ తరపున శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 
 
ఈ క్రమంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దూబేపై పదునైన ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రతన్ దూబేను మావోయిస్టులే హత్య చేసుకుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నించి విఫమలైన సీపీఎం... తొలి జాబితా రిలీజ్ 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెలంగాణ సీపీఎం నేతలంతా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను తాజాగా వెల్లడించింది. మొత్తం 14 మంది అభ్యర్థులతో ఆ జాబితాను విడుదల చేయగా, అందులో పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తున్నారు. 
 
అలాగే, ఈ ఎన్నికల్లో తమకు పట్టున్న 14 స్థానాల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెల్సిందే ఇందులోభాగంగా తొలిసారి 14 మంది అభ్యర్థులతో ఈ జాబితాను వెల్లడించింది. ఆదివారం సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. 
 
సీపీఎం తరపున పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే, కారం పుల్లయ్య (భద్రాచలం-ఎస్టీ), పిట్టల అర్జున్ (అశ్వారావు పేట-ఎస్టీ), తమ్మినేని వీరభద్రం (పాలేరు), పాలడుగు భాస్కర్ (మధిర - ఎస్సీ), భూక్యా వీరభద్రం (వైరా - ఎస్టీ), ఎర్ర శ్రీకాంత (ఖమ్మం), మాచర్ల భారతి (సత్తుపల్లి 0 ఎస్సీ), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), చిన వెంకులు (నకిరేకల్-ఎస్సీ), కొండమడుగు నర్సింహా (భువనగిరి), మోకు కనకారెడ్డి (జనగామ), పగడాల యాదయ్య (ఇబ్రహీంపట్నం), జె.మల్లికార్జున (పటాన్‌చెరు), ఎం.దశరథ్ (ముషీరాబాద్). 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో తారాస్థాయిలో పెరిగిన వాయు కాలుష్యం : ప్రైమరీ స్కూళ్ళకు సెలవు