Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో తారాస్థాయిలో పెరిగిన వాయు కాలుష్యం : ప్రైమరీ స్కూళ్ళకు సెలవు

Advertiesment
pollution delhi
, ఆదివారం, 5 నవంబరు 2023 (16:16 IST)
దేశ రాజధాని హస్తిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. ఢిల్లీలో నాణ్యత కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో ఆమ్ ఆద్మీ సర్కార్‌లో పలు చర్యలు చేపట్టింద. ఇందులోభాగంగా, చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికీ ఈ నెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించగా, వీటిని పదో తేదీకి పొడగించింది. గాలి నాణ్యత మెరుగుపడక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 
 
ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని స్కూళ్ల యాజమాన్యాలకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి ఉత్తర్వులు జారీ చేశారు. 6, 7 తరగతుల విద్యార్థుల విషయంలో స్కూల్ బంద్ పెట్టాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. అయితే, విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో చదువుకుంటామని చెబితే ఆమేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
 
ఆదివారం ఉదయం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడలేదు. ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 460 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీని కాలుష్యపు పొగ మంచు కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లిన వారు శ్వాసకోశ సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడంతో పాటు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్లా ఓడిపోతారు : కిషన్ రెడ్డి