Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ యువతిపై అత్యాచారం జరిగిన మాట నిజమే : సీబీఐ

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (16:25 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతిపై అత్యాచారం జరిగిన మాట నిజమేనని సీబీఐ తేల్చింది. ఈ మేరకు సీబీఐ చార్జిషీటును దాఖలు చేసింది. ఈ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ ప్రధాన నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ కేసులో సీబీఐ అధికారులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో 2017లో ఓ మైనర్ యువతిపై స్థానిక ఎమ్మెల్యేతో సహా ముగ్గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడినట్టు ఛార్జీషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టయిన సెంగార్ ప్రస్తుతం జైల్లో ఉంటూ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. 
 
ఇదిలావుంటే బాధితురాలు ఆమె న్యాయవాదితో సహా వస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద ఘటనలో ఆమె తన సొంత అత్త, పిన్నిని సైతం కోల్పోగా, తన కేసును వాదిస్తున్న న్యాయవాదితో సహా ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందించగా. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యింది. 
 
కాగా, 2017లో ఈమెపై జరిగిన అత్యాచారానికి సంబంధించి సీబీఐ అధికారులు ఢిల్లీలోని తీజ్ హజారీ జిల్లా కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితడు కుల్‌దీప్ సెంగార్‌తో పాటు నరేశ్ తివారీ, బ్రిజేష్ యాదవ్ సింగ్, శుభం సింగ్ అనే ముగ్గురిపేర్లు కూడా చేర్చారు. ఈ ఛార్జీషీట్‌లో పేర్కొన్నదాన్నిబట్టి జూన్ 4న కుల్‌దీప్ సెంగార్ అత్యాచారానికి పాల్పడగా. 
 
వారం రోజుల తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి చార్జీషీట్‌లో పేర్కొన్న ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. జూన్ 4న బాధితురాలిని ఎమ్మెల్యే తన నివాసానికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచారానికి పాల్పడ్డాడని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు నేనుగా యూపీ సీఎం యోగీ ఆదిత్యానాధ్ ఇంటిముందు ఆత్మహత్య యత్నం చేయడంతో.. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి గారితో వన్ ఇయర్ ట్రావెలయి చాలా నేర్చుకున్నా : ఉపేంద్ర

షూటింగులో గాయపడిన హీరో ప్రభాస్!

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్‌ను తగ్గాల్సిందే అన్నది ఎవరు? స్పెషల్ స్టోరీ

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments