Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు రక్షణ కల్పించేందుకు 25,000 ఫేస్‌ షీల్డ్స్‌.. సోనూసూద్‌ మరో దాతృత్వం

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (16:55 IST)
విలక్షణ నటుడు సోనూసూద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిద్రాహారాలు మాని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు 25,000 ఫేస్‌ షీల్డ్స్‌ను సదరు శాఖకు అందజేశారు.

ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. పోలీసు సిబ్బందికి 25,000 ఫేస్‌ షీల్డ్స్‌ను అందించిన సోనూసుద్‌ సహకారానికి ధన్యవాదాలు అంటూ ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్‌ వలస కార్మికులను బస్సులు, రైళ్ళు, చార్టర్డ్‌ విమానాల్లో సొంతూళ్ళకు తరలించిన విషయం తెలిసిందే.

వైద్య సిబ్బందికి కూడా తనవంతు సాయం చేశారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో గాయపడ్డ, ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేస్తానని సోనూసూద్‌ ఇటీవల చెప్పారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments