Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో24 నకిలీ యూనివర్సిటీలు: రాష్ట్రంలో ఒకటి.. యూపీలోనే అధికం

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (13:45 IST)
నకిలీ విశ్వవిద్యాలయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా యూనియన్ గ్రాంట్ కమిషన్ 24 ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయని తెలిపారు.
 
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి లోక్‌ సభలో పలువురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 8 ఫేక్ యూనివర్సిటీలను యూజీసీ గుర్తించినట్లు వెల్లడించారు. 
 
ఇక ఢిల్లీలో 7, ఒడిశాలో 2, పశ్చిమ బెంగాల్‌లో 2, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి‌లో ఒక్కో నకిలీ యూనివర్సిటీలను గుర్తించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు, మీడియా ఫిర్యాదుల ద్వారా ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు లోక్‌సభలో కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments