Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రష్మిక-శర్వా సినిమాలో కొత్త తారలు.. ఆ ముగ్గురు ఎంట్రీ?!

Advertiesment
రష్మిక-శర్వా సినిమాలో కొత్త తారలు.. ఆ ముగ్గురు ఎంట్రీ?!
, మంగళవారం, 3 ఆగస్టు 2021 (12:56 IST)
Rashmika_Sarvanand
దసరా సందర్భంగా వివిధ చిత్రాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందులో శర్వానంద్, రష్మిక జంటగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రస్తుతం కొత్త తారలు ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో సీనియర్ నటీమణులు, రాధిక, ఖుష్బూ, ఊర్వశీలు ఈ చిత్రంలో భాగం కానున్నట్లు యూనిట్ ప్రకటించింది.  
webdunia
Radhika Sarathkumar
 
రామ్‌తో ‘రెడ్’ సినిమా తర్వాత కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తోన్న సినిమా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’. గతంలో ఇదే టైటిల్‌తో కృష్ణంరాజు, చిరంజీవి, జయసుధ ప్రధాన పాత్రలో బాలచందర్ దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తెరకెక్కింది. ఇపుడు చాలా ఏళ్ల తర్వాత అదే ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ టైటిల్‌తో రష్మిక, శర్వానంద్ జోడిగా సినిమా తెరకెక్కుతోంది. 
webdunia
Kushboo
 
SLV సినిమా పతాకంపై ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మహిళ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మికకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించబోతున్నట్టు స్సష్టమవుతోంది. 
webdunia
Oorvasi




తెలుగులో రష్మిక వరుస సినిమాలకు సైన్ చేస్తోంది రష్మిక మందన్న. అల్లు అర్జున్ పుష్ప‌తో పాటు రామ్ చరణ్‌కు ఆచార్యలో జోడిగా నటిస్తోంది. వీటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులకు రష్మిక ఓకే చెప్పినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్రసాముతో అదరగొట్టిన PK తనయుడు.. వీడియో వైరల్