జమ్ముకాశ్మీర్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదులు.. ఇద్దరు టీచర్ల హతం

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (13:53 IST)
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పెచ్చరిల్లిపోతున్నాయి. శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు ఓ టీచర్‌ను హతమార్చారు. అలాగే గురువారం ఈద్గాం సంగం పాఠశాలపై ఉగ్రవాదులు చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులపై పాయింట్ బ్లాక్‌లో కాల్పులు జరిపారు. 
 
దీంతో వారిద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన టీచర్లను సిక్కు, కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సతీందర్ కౌర్‌, దీపక్ చాంద్‌గా పోలీసులు గుర్తించారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేసి.. ఉగ్రవాదుల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు వెల్లడించారు పోలీసులు.
 
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాజా హత్యలను ఖండించారు. మంగళవారం కూడా ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మసీ షాపు ఓనర్ 70 ఏళ్ల మఖన్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు కాల్చి చంపారు. 
 
రాత్రి ఏడు గంటల సమయంలో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతన్ని కాల్చారు. 1990 దశకంలో కశ్మీరీ పండిట్ బింద్రూ ఉగ్రవాదం హెచ్చు స్థాయిలో ఉన్న సమయంలోనూ ఫార్మసీ నడిపారు. కాగా.. గత ఐదు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments