Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల్లోనే యువకుడు మృతి

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (21:08 IST)
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 48 గంటల్లోనే ఒక 19 సంవత్సరాల యువకుడు మరణించాడు. వ్యాక్సినేషన్ నియమ నిబంధనలన్నీ పాటించామని, భోపాల్‌లోని ఎయిమ్స్ నుంచి పోస్ట్‌మార్టమ్ నివేదిక అందిన తర్వాత ఆ యువకుడి మరణానికి గల కారణాలు తెలుస్తాయని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం తెలిపారు. భన్వర్ గ్రామలో ఈ నెల 6వ తేదీన శుభం పర్మార్ అనే యువకుడు కొవిడ్-19 మొదటి డోసు టీకా వేసుకున్నాడు. 
 
టీకా వేసుకున్న తర్వాత అరగంట పాటు అక్కడే కూర్చున్న అతను మామూలుగానే తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతనికి వాంతులు కావడంతో ఆస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి సెహోర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం మరణించాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మృతదేహానికి భోపాల్‌లోని ఎయిమ్స్ డాక్టర్లు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఈ నివేదిక వచ్చిన తర్వాత యువకుడి మరణానికి అసలు కారణం ఏమిటో తెలుస్తుందని ఆస్తా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments