Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూటుగా మద్యం సేవించి స్కూలుకొచ్చిన హెచ్ఎం.. బాలికతో డ్యాన్స్

పూటుగా మద్యం సేవించి స్కూలుకొచ్చిన హెచ్ఎం.. బాలికతో డ్యాన్స్
, సోమవారం, 1 నవంబరు 2021 (10:46 IST)
పీకల వరకు మద్యం సేవించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్కూలుకు వచ్చాడు. మద్యం మత్తులో తన కుర్చీలో కుదురుగా కూర్చోవాల్సింది పోయి తరగతికి వచ్చి తను డ్యాన్స్ చేస్తూ బాలికలతో డ్యాన్స్ చేయించాడు. అంతేనా.. ఆ డ్యాన్సులను వీడియో తీసి సోషల్ మీడియాల పోస్ట్ చేశాడు. అవి కాస్త వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. 
 
ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. దామో జిల్లాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధియదో గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలవుంది. ఇక్కడ పనిచేసే ఓ హెచ్ఎం రాజేశ్ ముండా... శుక్రవారం తప్పతాగి స్కూలుకొచ్చాడు. 
 
తన కుర్చీలో కూర్చోకుండా తాను డ్యాన్స్ చేస్తూ విద్యార్థినులతో డ్యాన్స్ చేయించాడు. ఆ డ్యాన్సులు చిత్రీకరించాడు. ఈ వీడియోలు వైరల్ కావడం, విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు డీఈవో ఎస్‌కే మిశ్రాకు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించిన కలెక్టర్ కృష్ణ చైతన్య నివేదిక అందిన వెంటనే నిన్న రాజేశ్ ముండాను సస్పెండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ‌ధాని రైతుల కోసం పాద యాత్రలో పాల్గొంటా: సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ