రాజ్‌కోట్‌‌లో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. వీడియో తీసి బెదిరింపులు

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (16:58 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడు స్నేహితుడి సాయంతో ఆ తతంగాన్ని వీడియో తీసి బెదిరించాడు. సోమ్‌నాథ్‌ జిల్లా కోడినార్‌‌లో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. మల్ష్రామ్‌ గ్రామానికి చెందిన హితేశ్‌ సోలంకి (22) అనే యువకుడు స్థానికంగా 16 ఏళ్ల బాలికను అపహరించి శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ఒడిగట్టాడు. వ్యవహారాన్ని తన స్నేహితుడు ప్రకాశ్‌ మొరాసియా సాయంతో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెడతానంటూ బాధితురాలిని బెదిరించాడు. 
 
గత నెల 21న ఆమెను మరోమారు బెదిరించి శిథిలావస్థలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు. బాలికకు వివరీతమైన కడుపు నొప్పి రావడంతో విషయం తల్లికి చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడని అదుపులోకి తీసుకున్నామని కోడినార్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం