పెళ్లికి వెళ్ళి తిరిగొస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం.. రాత్రంతా కొట్టి.. ఆమెను..?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:25 IST)
దేశంలో అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహ వేడ‌ుక‌కు హాజ‌రై ఇంటికి తిరిగి వ‌స్తున్న ఓ బాలికను స‌మీప అట‌వీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లి ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. రాత్రంతా బాలిక‌ను బంధించే ఉంచిన నిందితులు తెల్ల‌వారుజామున వ‌దిలేశారు. ఆ త‌ర్వాత ఇంటికి వ‌చ్చిన బాధితురాలు అవ‌మానాన్ని భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గ‌త జూలైలో కొండ‌గావ్ జిల్లాలోని ఓ గ్రామంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. గ‌త జూలైలో బాధిత బాలిక స్నేహితుడితో క‌లిసి ఓ పెళ్లికి వెళ్లింది. పెళ్లి నుంచి తిరిగి వ‌స్తుండ‌గా అడ్డగించిన ఇద్ద‌రు వ్య‌క్తులు బాలిక స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెను అట‌వీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. అక్కడ మరో ఐదుగురు చేరారు. మొత్తం ఏడుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా బాలిక‌తోనే గ‌డిపిన నిందితులు తెల్ల‌వారుజామున ఆమెను వ‌దిలేశారు. అవ‌మానభారంతో కుంగిపోయిన ఆమె ఇంటికి చేరుకోగానే ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది.  
 
బాధితురాలి స్నేహితుడు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఆమె కుటుంబ‌ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిర్ల‌క్ష్యంగా మాట్లాడ‌టంతో ఏం చేయాలో తోచ‌క మృత‌దేహాన్ని ఖ‌న‌నం చేశారు. కానీ ఆమె తల్లిదండ్రులు నిందితులకు తగిన శిక్ష విధించాలని ఆందోళనకు దిగారు. దీంతో త‌న కూతురుకు న్యాయం జ‌రుగ‌లేద‌ని క‌ల‌త‌చెందాడు. మ‌నోవేద‌న భ‌రించ‌లేక‌ అక్టోబ‌ర్ 6న ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు. అనంతరం పోలీసులు ఐదుగురు నిందితుల‌ను అరెస్ట్ చేసి, ప‌రారీలో ఉన్న మ‌రో ఇద్ద‌రి కోసం గాలిస్తున్నారు. 
 
బాలిక మృత‌దేహాన్ని వెలికి తీయించి పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. అయితే ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌న్న బాధిత కుంటుంబం ఆరోప‌ణ‌ల‌ను పోలీసులు ఖండించారు. ఈ విష‌యమై గ‌తంలో త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేద‌ని ఖాకీలు బుకాయిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments