Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం... అసాధారణ సెక్స్‌ కోసం బాలుడికి బట్టలూడదీసి నగ్నంగా చేశారు...

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (12:35 IST)
దేశ రాజధాని ఢిల్లీలో పోకిరీల వికృత చేష్టలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా మరో అవమానవీయ సంఘటన ఒకటి చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం సేవించిన కొందరు యువకులు 16 ఏళ్ల బాలుడి పట్ల అతి దారుణంగా ప్రవర్తించారు. ఢిల్లీలోని ఇందర్‌పుర ఏరియాలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. 
 
ఈ సంఘటనపై సౌత్‌వెస్ట్ డీసీపీ సురేందర్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించిన కొందరు యువకులు ఒక బాలుడిని వెంటబడి వేధించినట్టు తెలిపారు. అయితే బాధితుడిపై ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని వైద్య పరీక్షల్లో తేలినట్టు తెలిపారు. అకారణంగా కొట్టినందుకు నిందితులపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు. 
 
కానీ, ఆ పోకిరీలు తీసి పోస్ట్ చేసిన వీడియోలో మాత్రం బాలుడి చేతులు కాళ్ళు కట్టేసి కొట్టి చిత్రహింసలకు గురిచేసినట్టుగా ఉంది. ఆ తర్వాత ఆ బాలుడి నోటిలోకి బీరు బాటిల్స్‌ను బలవంతంగా నెట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. మరోవైపు బాలుడిపై లైంగిక దాడి జరిగిందని అతడి బంధువులు ఆరోపించారని, ఈ అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం