Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా ముదిరిన మహారాష్ట్ర సంక్షోభం : షిండే గూటికిన 14 మంది ఎంపీలు?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (14:32 IST)
మహారాష్ట్ర రాజకీయం మరింత సంక్షోభం దిశగా పయనిస్తుంది. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు శివసేనపై తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ చీలిక దిశగా సాగుతుండగా.. తాజాగా 14 మంది ఎంపీలు కూడా రెబల్స్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
శివసేన పార్టీకి లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 14 మంది ఏక్‌నాథ్‌ షిండే, భాజపాతో టచ్‌లో ఉన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా షిండే వర్గంలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. అదే నిజమైతే, శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం ప్రయత్నిస్తోన్న షిండేకు మరింత బలం చేకూరినట్లవుతుంది.
 
మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది సభ్యులున్నారు. వీరిలో 39 మంది తిరుగుబాటు చేశారు. వీరికి షిండే నాయకత్వం వహిస్తున్నారు. దీంతో అసలైన శివసేన పార్టీ తమదేనని, అసెంబ్లీలో తమ వర్గాన్నే శివసేనగా గుర్తించాలని షిండే కోరుతున్నారు. 
 
ఇదే విషయమై త్వరలోనే ఆయన గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీలు కూడా శిందేకు మద్దతిచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments