Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏక్‌నాథ్ షిండేకు అంతకంతకూ పెరుగుతున్న మద్దతు.. ఇప్పటికి 50 మంది...

eknath sinde
, శుక్రవారం, 24 జూన్ 2022 (10:48 IST)
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. శివసేన రెబల్‌ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా షిండే క్యాంప్‌లో చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు సమాచారం. వారిలో దాదాపు 40 మంది శివసేనకు చెందిన వారే జాతీయ మీడీయా కథనాలు చెబుతున్నాయి. 
 
'మాపై నమ్మకం ఉన్నవారు చేతులు కలపొచ్చు. మేము బాలా సాహెబ్‌ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తాం' అని పిలుపునిచ్చారు. మా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన నోటీసులు ఇవ్వడం చట్టవ్యతిరేకమని షిండే ఆరోపించారు. 
 
'వారు నిన్న చేసింది చట్టవ్యతిరేకం. వారికి ఆ హక్కు లేదు. మేము మెజార్టీ ఉన్నవాళ్లం. ప్రజాస్వామ్యంలో అంకెలు చాలా కీలకం. వారికి సస్పెండ్‌ చేసే హక్కు కూడా లేదు' అని ఆయన వెల్లడించారు. 
 
ఇప్పటికే 37 మంది ఎమ్మెల్యేలు.. ఏక్‌నాథ్‌ శిందేను తమ నాయకుడిగా పేర్కొంటూ గవర్నర్‌, డిప్యూటీ స్పీకర్‌కు లేఖలు రాశారు. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేసిన కొద్దిసేపటికే ఈ లేఖలు వెళ్లడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన తీర్థం పుచ్చుకున్న మాజీ ఐఏఎస్ అధికారి