ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : పది మంది మృతి

ఠాగూర్
సోమవారం, 12 మే 2025 (11:54 IST)
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాయ్‌పూర్ - బలోద బజార్‌ మార్గంలో సోమవారం వేకువజామున జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 13 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ప్రయాణికులతో వెళుతున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృత్తుల్లో తొమ్మిది మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్టు రాయ్‌పూర్ ఎస్పీ లాల్ ఉమ్మెద్ సింగ్ తెలిపారు. 
 
బాధితులు ఓ వివాహ వేడుకకు హాజరై చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments