Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (19:47 IST)
కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కర్నాటకలోని కల్బురిగి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విడగొట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, ఇందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని 11 మంది పాలనలో దేశ యువతకు తప్పుదోవ పట్టించారని, అనేక తప్పులు చేశారని దయ్యబట్టారు. 
 
వాల్మికి కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలకు సంబంధించి ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల ఇళ్ళపై ఈడీ దాడులు కుట్రపూరితంగా చేస్తున్నారు. "కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచేందుకే మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. మా ఎంపీలపై ఆరోపణలు మోపి, దాడులు చేయిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలిక రాదు, మేమంతా ఐక్యంగా ఉన్నాం" అన్నారు. 
 
"మోడీ 11 పాలనలో ఎన్నో తప్పులు జరిగాయి. లెక్కలేనన్ని అబద్దాలు చెప్పి దేశ యువతను మోసం చేశారు. ఈ సుధీర్ఘకాలంలో ఆయన ప్రభుత్వం ఏకంగా 33 తప్పులు చేసింది. నా రాజకీయ జీవితంలో ఇలా అబద్దాలు చెప్పి, యువతను, పేదలను మోసగించి ఓట్లు దండుకునే ప్రధానమంత్రిని ఎపుడూ చూడలేదు. ఇపుడు మోడీ రూపంలో చూస్తున్నాను. ఆయనకు ప్రజల బాగోగుల గురించి ఏమాత్రం పట్టదు" అని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments