ఆగ్రాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ట్యూషన్‌కు అంటూ వెళ్లి..?

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (21:57 IST)
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. ఆరేళ్ళ ఏళ్ల బాలికపై 11 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సదరు బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లిన బాలుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
అయితే బాలిక రక్తపు గాయంతో ఇంటికి రావడంతో తండ్రి విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
ఆసుపత్రిలో పోలీసులు బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేయలేకపోయారు. బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం.. బాధితుకాలు శనివారం సాయంత్రం ట్యూషన్ క్లాసుల కోసం వెళ్లిన సమయంలో బాలుడు తనతో పాటు నిర్మానుష్య ప్రదేశానికి రమ్మని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలియవచ్చింది. 
 
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. బాలుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత జువైనల్ హోమ్‌కు పంపుతామని డీసీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం