Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిరాయి మూకలకు సుపారీ ఇచ్చిమరీ తండ్రిని చంపించిన టీజర్.. ఎక్కడ?

Advertiesment
murder

వరుణ్

, ఆదివారం, 24 మార్చి 2024 (10:10 IST)
కిరాయి మూకలకు సుపారీ ఇచ్చిమరీ ఓ టీనేజర్ కన్నతండ్రిని హత్య చేయించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్‌లో గురువారం జరిగింది. తన రోజువారీ ఖర్చులకు తండ్రి సరిపడ డబ్బులు ఇవ్వడం లేదన్న అక్కసుతో ఆ టీనేజర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్య కేసులో భాగస్వాములైన టీనేజర్‌తో సహా కిరాయి సభ్యులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహ్మద్ నదీమ్ (50) అనే వ్యాప్రిని గురువారం పత్తీ ప్రాంతంలో కొందరు నిందితులు బైకుపై వచ్చి కాల్చి చంపారు. ఈ దాడికి పాల్పడిన పియూష్ పాల్, శుభమ్ సోనీ, ప్రియాంశూలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమకు నాయిమ్‌ను చంపమని ఆయన కొడుకే సుపారీ ఇచ్చినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు. తండ్రిని చంపాలంటూ ఆ టీనేజర్ మాకు సుమారీ ఇచ్చాడు. ఒక్కొక్కరికీ ఆరు లక్షలు ఇస్తామన్నాడు. ముందస్తుగా రూ.1.5 లక్షలు ఇచ్చాడు. పని పూర్తయ్యాక మిగతాది ఇస్తామన్నాడు" అని విచారణలో వెల్లడించాడు. 
 
కాగా, తన అవసరాలకు తగినంతగా డబ్బులు ఇవ్వని తండ్రిపై టీనేజర్ కోపం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. డబ్బులు చాలక అతడు తరచూ తండ్రి షాపులోనే నగదు లేదా ఇంట్లోని నగదు చోరీ చేస్తూ వచ్చాడు. గతంలోనూ తండ్రిని చంపించాలనుకుని ప్రయత్నించి విఫలమయ్యాడని తెలిపారు. షూటర్లను జైలుకు తరలించిన పోలీసులు.. టీనేజర్‌ను మాత్రం జువైనల్ హోంకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు పోలీస్‌ను అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్.. కారణం ఏంటి?