దేశంలో 11 వేల కొత్త కేసులు.. 13 వేల రికవరీలు

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (10:24 IST)
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 8,70,058 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,451 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

ముందురోజు కంటే 5.5 శాతం మేర పెరుగుదల కనిపించింది. అలాగే నిన్న 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 3.43 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,61,057 మంది మహమ్మారికి బలయ్యారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. క్రియాశీల, రికవరీ రేట్లు ఊరటనిస్తున్నాయి. క్రియాశీల రేటు గతేడాది మార్చి నాటి కనిష్ఠానికి చేరగా.. రికవరీ రేటు అప్పటి గరిష్ఠానికి చేరింది.

ప్రస్తుతం 1,42,826 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 0.42 శాతానికి చేరింది. నిన్న 13,204 మంది కోలుకోగా.. మొత్తంగా 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. దాంతో రికవరీ రేటు 98.42 శాతానికి చేరింది.
 
పండగల సీజన్, ప్రభుత్వ సెలవులు కారణంగా గత నెల నుంచి టీకా కార్యక్రమం నెమ్మదించింది. నిన్న 23,84,096 మంది టీకా వేయించుకోగా.. ఇప్పటి వరకు 108 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments