వ్యాక్సినేషన్ ద్వారా భారత్ శక్తి ఏంటో చూపించాం : ప్రధాని మోడీ

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (10:45 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించిన దేశంగా నిలిచింది. 
 
దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోవడం దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయమ‌న్నారు. భార‌త్‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ద్వారా దేశ శ‌క్తి ఏంటో ప్ర‌పంచానికి చూపించామ‌ని చెప్పారు.
 
క‌ఠిన‌మైన ల‌క్ష్యాలను దేశం విజయవంతంగా చేరుకోగ‌ల‌ద‌ని చెప్ప‌డానికి ఇదొక నిదర్శనమన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా టీకాలు అందించామ‌న్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్ శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడి కొన‌సాగింద‌ని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇప్ప‌టికీ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందేన‌ని తెలిపారు.
 
బయటకు వెళ్లినప్పుడు చెప్పులు ఎలా వేసుకుంటామో, అంతే సాధార‌ణంగా మాస్క్ కూడా ధ‌రించాల‌ని కోరారు. దేశ‌ ఆర్థిక వ్యవస్థ పట్ల దేశీయ నిపుణ‌ల‌తో పాటు విదేశీ నిపుణులు కూడా చాలా సానుకూలంగా ఉన్నారన్నారు. ఇప్పుడు దేశానికి భారీగా పెట్టుబడులు వ‌స్తున్నాయ‌ని గుర్తు చేసిన ఆయన... దేశ‌ యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయ‌ని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments