Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌ రహదారులు రక్తసిక్తం.. వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృతి

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (08:42 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది మృత్యువాతపడ్డారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బారాముల్లా, కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదాల్లో వీరు ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ఉరి ప్రాంతంలో ప్రయాణికుల వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. 
 
అలాగే, కిష్త్వార్ జిల్లాలోని వార్వాన్ ప్రాంతంలో రహదారి పనుల్లో ఉన్న స్నోకర్ వాహనం ప్రమాదానికి గురికావడంతో మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, ఈ ప్రమాదాల్లో చనిపోయిన మృతుల కుంటుబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు కిష్త్వార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ దివాన్స్ యాదు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణఆలు కోల్పోయిన వారి కుటంబాలకు అండగా ఉంటామని జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

వంద రోజుల పాటు ఆలరించిన రియాలిటీ షో ... నేడు బిగ్‌బాస్ టైటిల్ ప్రకటన

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments