Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (09:04 IST)
దేశ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఐదో విడత పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ దశలో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 14 స్థానాలకు, మహారాష్ట్రలో 13, వెస్ట్ బెంగాల్‌లో 7, బీహార్‌లో 5, ఒరిస్సాలో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌లలో ఒక్కో స్థానానికి చొప్పున పోలింగ్ నిర్వహించనున్నారు. 
 
ఐదో విడతల బరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, పియూష్ గోయల్, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ, లోక్‌ జనశక్తి అధినేత చిరాగ్ పాశ్వాన్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు. 
 
కాగా, ఈ సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు 4 దశల్లో 379 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. సోమవారం ఐదో దశ పోలింగ్ జరుగుతుండగా, ఈ నెల 25వ తేదీన ఆరో దశ, జూన్ ఒకటో తేదీన ఏడో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ నాలుగో తేదీ దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపడుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments