Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్ ఆస్తులు ఎంతో తెలుసా?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (11:58 IST)
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన సెంట్రల్ బెంగుళూరు లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇటీవల ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇందులో ఆయన తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. 
 
ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన నామినేషన్ పత్రాల్లో ఆయన ఆస్తుల విలువను మొత్తం రూ.31 కోట్లుగా వెల్లడించారు. ఇందులో రూ.26.59 కోట్ల స్థిరాస్తులు కాగా, రూ.4.93 కోట్ల చరాస్తులుగా ఉన్నాయి. అలాగే, పెట్టుబడి రూపంలో రూ.2.94 కోట్లు ఉన్నాయని ప్రకాశ్ తెలిపారు. 
 
ఇకపోతే, గత యేడాది సినిమాల ద్వారా రూ.2.40 కోట్ల ఆదాయం సమకూరగా, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేలు ఉన్నట్టు తెలిపారు. వీటితో పాటు.. రూ.1.88 కోట్ల విలువ చేసే వాహనాలు, భార్య రష్మి వర్మ పేరిట రూ.20.46 లక్షల చరాస్తి, రూ.35 లక్షల స్థిరాస్తి.. రూ.18 లక్షల విలువ చేసే ఆభరణాలున్నాయని ప్రకాష్ రాజ్ తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments