Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి ఎన్నికల ఏజెంటుగా రాముడు.. ప్రజాస్వామ్యం దెబ్బ రుచిచూపిస్తా : మమత వార్నింగ్

Webdunia
మంగళవారం, 7 మే 2019 (19:54 IST)
భారతీయ జనతా పార్టీకి ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తాడని, అంటే రాముడిని బీజేపీ ఎన్నికల ఏజెంటుగా మార్చివేసిందని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 
 
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా, పురూలియాలో జరిగిన సభలో ఆమె పాల్గొని బీజేపీపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ టోల్ కలెక్టర్‌గా అభివర్ణించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజాస్వామ్యం సత్తా ఏమిటో ప్రధానికి రుచి చూపిస్తానని ఆమె చెప్పారు. అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో అక్రమ మార్గంలో, కేంద్ర బలగాలను ఉపయోగించి ఓటర్లతో బలవంతంగా బీజేపీకి ఓట్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. 
 
అదేసమయంలో బీజేపీ నేతలకు ఎన్నికలకు ముందు మాత్రమే రాముడు గుర్తుకు వస్తారన్నారు. అంటే.. రాముడిని బీజేపీ ఓ ఎన్నికల ఏజెంటుగా ఉపయోగించుకుంటుందంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రాముడి గుడి కట్టితీరుతామని హడావుడి చేసే బీజేపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక దేశంలో ఒక్క రామాలయమైనా కట్టించారా అని మమతా బెనర్జీ సూటిగా ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments