కృష్ణా పుష్క‌రాల 12 రోజుల్లో... ఏయే రోజు ఏ దానం...?

విజ‌య‌వాడ‌: ఆగ‌స్టు 12 నుంచి 23 వరకూ 12 రోజుల పాటు కృష్ణా పుష్క‌రాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో పితృక‌ర్మ‌ల‌తో పాటు పుష్క‌రుడికి ఏ రోజు ఏదానం చేస్తే ఏ ఫ‌లితం ఉంటుందో తెలుసుకుందాం. మొదటి రోజు: బంగారం,

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (18:00 IST)
విజ‌య‌వాడ‌: ఆగ‌స్టు 12 నుంచి 23 వరకూ 12 రోజుల పాటు కృష్ణా పుష్క‌రాలు జ‌రుగుతున్నాయి. ఈ స‌మ‌యంలో పితృక‌ర్మ‌ల‌తో పాటు పుష్క‌రుడికి ఏ రోజు ఏదానం చేస్తే ఏ ఫ‌లితం ఉంటుందో తెలుసుకుందాం.
 
మొదటి రోజు: బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేయాలి.
ఫలితం: బంగారం, వెండి దానం చేయడం వల్ల ఇహలోక సుఖభోగాలతో పాటు సూర్యచంద్ర లోకాల ప్రాప్తి కలుగుతుంది. భూదానం వల్ల భూపతిత్వం వస్తుంది. ధాన్య దానం వల్ల కుబేర సంపద కలిగిస్తుంది.
 
రెండో రోజు: గోవు, వస్త్రం, రత్నం, లవణ దానాలు చేయాలి.
ఫలితం: గోవు దానం చేయడం వల్ల రుద్రలోక ప్రాప్తి, వస్త్ర దానం వల్ల వసులోక ప్రాప్తి, రత్న దానం వల్ల సార్వభౌమత్వం, లవణ దానం వల్ల శరీర ఆరోగ్యం కలుగుతాయి.
 
మూడో రోజు: శాఖ, ఫల, గుడాలు (గుగ్గిళ్లు), అశ్వదానాలు చేయాలి.
ఫలితం: కుబేర, అశ్వనీ దేవతాలోక సౌఖ్యాలు అనుభవించి, ఇంద్రసమాన వైభవం పొందుతారు.
 
నాలుగవ రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె దానం చేయాలి.
ఫలితం: పాలు దానం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి. తేనె దానం చేస్తే వైకుంఠ నగర ప్రవేశం, ఘృత (నెయ్యి) దానం వల్ల ఆయువు వృద్ధి చెందుతుంది. తైల(నూనె) దానం వల్ల నరక నివారణ కలుగుతుంది.
 
ఐదో రోజు: ధాన్యం, బండి, గేదె, ఎద్దులను దానంగా ఇవ్వాలి.
ఫలితం: ఈ దానాల వల్ల దివ్యమైన భోగభాగ్యాలతో కైలాస నివాసం కలుగుతుంది.
 
ఆరో రోజు: అగరు, కస్తూరి, చందన దానాలు చేయాలి. ఔషధ దానం అంటే వట్టివేరు, జాజికాయ, జాపత్రి, కరక్కాయ వంటివి దానం చేయాలి.
ఫలితం: ఆరోగ్యం, భాగ్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంద్ర, చంద్ర, గంధర్వ లోక నివాసం కలుగుతుంది. 
 
ఏడో రోజు: గృహ, పీఠ, శయ్యా, ఆందోళికా దానాలు చేయాలి.
ఫలితం: చిరకాల సౌఖ్యం, అమరత్వం, మరు జన్మలో ప్రభుత్వ అధికారం లభిస్తాయి.
 
ఎనిమిదో రోజు: గంధ, దారు, పుష్పమాలా దానాలు చేయాలి.
ఫలితం: ఇంద్రలోకంలో దివ్యమైన శుభాలు ప్రాప్తిస్తాయి.
 
తొమ్మిదో రోజు: పిండదానం, పితృదేవతా ఆరాధనం చేయాలి. దాసీ, శయ్యా, కంబళ దానాలు ఇవ్వాలి.
ఫలితం: పితృదేవతల అనుగ్రహం వల్ల వంశవృద్ధి కలుగుతుంది. స్వర్గ సుఖాలు లభిస్తాయ‌ని శాస్త్రాలు చెపుతున్నాయి.
 
పదవ రోజు: మహాశాక, సాలగ్రామ, పుస్కక దానము చేయాలి
 
పదకొండవ రోజు: గజ తురగాది దానములు
పన్నెండవ రోజు: తిలా దానము
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సార్, నా చేయి విరిగింది చూడండి, ప్లీజ్ మా ఊరికి రోడ్డు వేయండి: విద్యార్థి వీడియో

భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అమ్మేసిన భార్య.. అలా సెటిలైపోయింది..

బిల్ గేట్స్‌కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ జియో పెవిలియన్‌ సందర్శన

ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

తర్వాతి కథనం
Show comments