శ్రీవారి నమూనా ఆలయాన్ని సందర్శించిన సీఎం చంద్ర‌బాబు

విజ‌య‌వాడ ‌: కృష్ణా పుష్కరాల సందర్భంగా తితిదే విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందర్శించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి తితిదే ధర్మకర్తల మండలి

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (22:14 IST)
విజ‌య‌వాడ ‌:  కృష్ణా పుష్కరాల సందర్భంగా తితిదే విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానాల్లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సందర్శించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు డా|| చదలవాడ కృష్ణమూర్తి, జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తితిదే అర్చకులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
 
పుష్కరాల సందర్భంగా తితిదే చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్న తితిదే సిబ్బందిని అభినందించారు. భక్తులకు ఏయే ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారన్న విషయాన్ని జెఈవోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తితిదే ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ప్రచురించిన మొత్తం 36 పుస్తకాలను గౌ|| ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
 
ఈ కార్యక్రమంలో తితిదే అదనపు సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ  సుధాకరరావు, ఎస్వీబీసీ సిఇవో నరసింహారావు, ప్రచురణల ప్రత్యేకాధికారి  ప్రయాగ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

లైంగిక వేధింపులు - భారత సంతతికి చెందిన 13 యేళ్ల జైలు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

తర్వాతి కథనం
Show comments