కృష్ణా పుష్కరాలు 2016... ఏ వాహ‌నం, ఎక్క‌డ నిల‌పాలి...?

విజ‌య‌వాడ‌: కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను ఎక్క‌డ నిలుపుతారో వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించారు. ఆగస్టు 12 నుంచి పుష్క‌రాలు ముగిసే వ‌ర‌కు నిర్దేశిత ప్రాంతాల్లో వాహ‌నాలు నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు ఆదేశి

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (21:52 IST)
విజ‌య‌వాడ‌: కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను ఎక్క‌డ నిలుపుతారో వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించారు. ఆగస్టు 12 నుంచి పుష్క‌రాలు ముగిసే వ‌ర‌కు నిర్దేశిత ప్రాంతాల్లో వాహ‌నాలు నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు ఆదేశించారు. 
 
*  బస్సులు ఆపే ప్రాంతాలు : హైదరాబాద్ రూటులోంచి వచ్చే బస్సులను ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు అనుమతి 
*  ఏసీ బస్సులకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు అనుమతి.
*  తిరువూరు, మైలవరం నుంచి వచ్చే బస్సులకు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్  ఎ- కాలనీలో స్టాప్ ఏర్పాటు.
* విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులను వైవీ రావ్ ఎస్టేట్ వద్ద నిలిపివేత
* తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి  జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిలిపివేత
*  మచిలీపట్నం, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే బస్సులను కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద నిలిపివేత
* తిరుపతి నుంచి ఆ రూట్ లో వచ్చే బస్సులను గుంటూరు బస్ స్టేషన్ వరకు అనుమతి - అక్కడి నుంచి గుంటూరు-విజయవాడ పుష్కర్ స్పెషల్ షటిల్ సర్వీసులు.
 
*  రైళ్లు నిలుపుదల ప్రాంతాలు  :  హైదరాబాద్ నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను రాయనపాడు వరకు అనుమతి.
*  విశాఖపట్నం నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను రామవరప్పాడు, గుణదల స్టేషన్లలో నిలుపుదల.
* గుంటూరు వైపు నుంచి, తెనాలి వైపు నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వరకూ అనుమతి - అక్కడ నుంచి పుష్కర్ స్పెషల్ బస్సుల్లో విజయవాడ చేరుకోవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏంటయ్యా ఇది..? పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నాడని మందలిస్తే మాస్టారిపై దాడి

నారా దేవాన్ష్ ఈ తరం పిల్లలలాగా టెలివిజన్, ఫోన్లలో లేడు.. నారా లోకేష్

యుద్ధంలో ఇరాన్ ఓడితే తర్వాత టార్గెట్ మేమే: పాకిస్తాన్ రక్షణ మంత్రి

ఎంకె స్టాలిన్‌తో జగన్ సంబంధాలు.. బీజేపీని ఎదిరించే ధైర్యం ఆయనకుందా?

వరుసకు చెల్లితో ప్రేమాయణం.. పురుగుల మందు తాగింది.. చివరికి ఏమైంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. పనులు ముందుకు సాగవు...

అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది

01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

తర్వాతి కథనం
Show comments