Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రం నేల మీద కూర్చోవడం మీరు ఎప్పుడైనా చూసారా?

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (12:22 IST)
గుర్రం అతి వేగంగా పరిగెత్తగల జంతువు. వేగంతో పాటు అనేక కిలోమీటర్ల దూరం పరుగెత్తినా అలసిపోని శక్తి దాని సొంతం. అలాంటి గుర్రం మిగతా జంతువుల్లా నేల మీద ఎందుకు కూర్చోదో మీకు తెలుసా? 
 
సాధారణంగా ఆవు, మేక, గేదెలాంటి జంతువులు నేల మీద నాలుగు కాళ్లని ముడుచుకుని కూర్చుని సేద తీరడం చూస్తుంటాం. ఏనుగు, ఒంటెలాంటి పెద్ద జంతువులు కూడా అలాగే నేలపై కూర్చుంటాయి. ఈ జంతువులు అలా కూర్చోవడం ద్వారా కాళ్ల కండరాలకు విశ్రాంతిని ఇస్తాయి. కానీ గుర్రం అలా కనిపించదు. 
 
అందుకు కారణం దాని కాళ్లలోని కండరాలు చాలా బలంగా, దృఢంగా ఉండడమే. గుర్రం నిలబడి ఉన్నప్పుడు, మూడు కాళ్లపైనే ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ దేహాన్ని నిలదొక్కుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కాబట్టి మిగతా జంతువుల మాదిరి కాళ్లు ముడుచుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. గుర్రానికి మరో ప్రత్యేకత ఉంది. అది నిలబడి కూడా నిద్రపోగలదు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments