Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారికి విశ్వాసాన్ని ఎలా నేర్పించాలి..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (12:16 IST)
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే.. వారికి అదేపనిగా పాఠాలు నేర్పించడం కాదు. తల్లిదండ్రులు వారిపట్ల చూపే ప్రేమతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి ఆ విశ్వాసాన్ని వారిలో ఎలా పెంచాలో తెలుసుకుందాం..
 
మీరు ఉద్యోగం చేస్తున్నా లేదా ఇంటి పనులతో తీరికలేకపోయినా.. పిల్లలతో వీలైనంత ఎక్కువగా సమయం కేటాయించేలా చూసుకోవాలి. కనీసం రోజులో ఓ గంటపాటైనా పిల్లలతో గడిపేలా ఉంటే.. వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది. అది మీ మధ్య బంధాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. దాంతోపాటు వారిలో ధైర్యాన్ని కూడా పెంచుతుంది.
 
పిల్లలకు ఏదైనా చెప్పించేటప్పుడు.. మనం అన్నివేళలా వారికి తోడుగా ఉంటామని వారికి ధైర్యాన్ని పెంచాలి. వాళ్లు ఏ మాత్రం నిరుత్సాహంగా ఉన్నా దగ్గరకు తీసుకుని కబుర్లు చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ప్రేమను స్పర్శద్వారా చిన్నారులకు తెలియజేయాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 
 
ఒక్కోసారి పిల్లలు తల్లిదండ్రులను విసిగిస్తుంటారు. వెంటనే తల్లిదండ్రులు చేసే పని.. నాలుగు దెబ్బలు వేయడం లేదా గట్టిగా కోప్పడడం. అలా చేయడం వలన వారు మరింత మొండిగా మారుతారు తప్ప మీ మాట వినరు. అందుకే ఆ సమయంలో కాసేపు మౌనంగా ఉండండి.. తర్వాత నిదానంగా చెప్పండి.. వాళ్ల గురించి వాళ్లకే తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments