పిల్లలకు రోజూ ఓ ఆమ్లెట్ ఇస్తున్నారా? నిల్వచేసిన స్నాక్స్ వద్దే వద్దు..

పిల్లలకు అన్నీ రుచులను చిన్ననాటి నుంచి అలవాటు చేయాలి. ఆహార పదార్థాల్లోని రుచిని, అందులోని పోషకాల గురించి పిల్లలకు చిన్ననాటి నుంచే చెప్పాలి. పిల్లలకు హోటల్ ఫుడ్‌ను అలవాటు చేయకూడదు. బర్గర్లు, పిజ్జాలు త

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (15:54 IST)
పిల్లలకు అన్నీ రుచులను చిన్ననాటి నుంచి అలవాటు చేయాలి. ఆహార పదార్థాల్లోని రుచిని, అందులోని పోషకాల గురించి పిల్లలకు చిన్ననాటి నుంచే చెప్పాలి. పిల్లలకు హోటల్ ఫుడ్‌ను అలవాటు చేయకూడదు. బర్గర్లు, పిజ్జాలు తీసుకోకపోవడం మంచిది. ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా పిల్లలను పెంచాలి. ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని తీసుకునేలా అలవాటు చేయాలి. ఆహారంలో పోషకాలు, పండ్లు తీసుకునేలా అలవాటు చేయాలి. 
 
వారంలో చేపలు, మాంసకృత్తులతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. సాల్మన్ ఫిష్‌తో పాటు రొయ్యలతో చేసిన వంటకాలు పిల్లలకు అందించడం ద్వారా ఎముకల్లో బలం చేకూరుతుంది. అలాగే రోజుకు ఓ కోడిగుడ్డును పిల్లల డైట్‌లో చేర్చడం ద్వారా వారికి అందాల్సిన పోషకాలు అందించినట్లవుతారు. ఆమ్లెట్ల ద్వారా కోడిగుడ్డును ఇవ్వడం చేయాలి. ఆమ్లె‌ట్లో ఉల్లితరుగు, కొత్తిమీర, మిరియాల పొడిని చేర్చాలి. 
 
వారానికి ఓసారి లేదా రెండుసార్లు అరటిపండ్లు-తేనెను కలుపుతూ స్మూతీలు ఇవ్వాలి. నిల్వచేసిన స్నాక్స్ ఇవ్వడం కూడదు. చాలారోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం మానేయాలి. తాజాగా వండిన ఆహారాన్ని, స్నాక్స్‌ను పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తర్వాతి కథనం
Show comments