Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముడతలను తొలగించుకోవాలా? అరటి గుజ్జుతో ప్యాక్ వేసుకోండి..

ముడతలకు చెక్ పెట్టాలంటే.. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, చెంచా తేనె కలుపుకుని.. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పది

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (15:42 IST)
ముడతలకు చెక్ పెట్టాలంటే.. గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, చెంచా తేనె కలుపుకుని.. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పది బాదం గింజలు తీసుకుని రాత్రే నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు పచ్చిపాలు పోసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి అరగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు చేస్తుంటే ముడతలు పెరగకుండా ఉంటాయి.
 
బాదంలో ‘విటమిన్‌ ఈ’తో పాటూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. అలాగే బాగా పండిన అరటి గుజ్జును ముఖానికి పట్టిస్తే ముడతలు తొలగిపోతాయి. లేదంటే.. అరటి గుజ్జుతో చెంచా పెరుగు, తేనెను కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా మారుతుంది.

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments