Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో.. ఇలా ఈజీగా తెలుసుకోవ‌చ్చు

విజ‌య‌వాడ‌: బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో తెలియ‌క ఒక్కోసారి మ‌న‌కు మ‌న‌మే తిక‌మ‌క‌ప‌డ‌తుంటాం. చెక్కులు జారీ చేయాల‌న్నా... ఏదైనా కొనాల‌న్నా... ఏటీఎం ద్వారా మ‌నీ డ్రా చేయాల‌న్నా... అస‌లు ఎంతుందో తెలియాలిగా... ఇది ఒక్క‌సారి కాస్త చిరాకు తెప్పించే అంశ‌మే. అ

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:10 IST)
విజ‌య‌వాడ‌: బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో తెలియ‌క ఒక్కోసారి మ‌న‌కు మ‌న‌మే తిక‌మ‌క‌ప‌డ‌తుంటాం. చెక్కులు జారీ చేయాల‌న్నా... ఏదైనా కొనాల‌న్నా... ఏటీఎం ద్వారా మ‌నీ డ్రా చేయాల‌న్నా... అస‌లు ఎంతుందో తెలియాలిగా... ఇది ఒక్క‌సారి కాస్త చిరాకు తెప్పించే అంశ‌మే. అసలు ఏ నెంబర్‌కి కాల్ చేస్తే మన బ్యాంక్ బ్యాలన్స్ తెలుస్తుందో అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. తీరా ఆ నెంబర్ దొరికిన తర్వాత కాల్ చేస్తే.. ఈ ఆప్షన్ నొక్కండి.. ఆ ఆప్షన్ నొక్కండి అంటూ మరింత సమయాన్ని వృధా చేస్తాయి.
 
ఈ తల నొప్పినుండి ఖాతాదారులను కాపాడటానికే రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా ఓ కొత్త నెంబర్‌ను ప్రవేశపెట్టింది. ఈ నెంబర్‌కు డయిల్ చేస్తే చాలు క్షణాల్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవచ్చు. దీనికి మీ ఇంటర్నెట్‌తో కూడా పని లేదు. మీ బ్యాంక్ ఎకౌంట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుండి *99# డయిల్ చేస్తే చాలు. మీరు ఈ నెంబర్ డయిల్ చేసిన వెంటనే మీ ఫోన్ స్క్రీన్ పైన 3 ఆప్షన్స్ కనిపిస్తాయి.
 
1. మీ బ్యాంక్ మూడు అక్షరాలూ టైపు చేయమంటుంది. లేదా..
2. మీ బ్యాంక్ IFSC కోడ్‌లో మొదటి నాలుడు అక్షరాలూ టైపు చేయమంటుంది. లేదా..
3. మీ బ్యాంక్ 2 డిజిట్ కోడ్‌ను టైపు చేయమంటుంది.
 
కావాల్సిన వివరాలిచ్చిన తర్వాత మీ ఫోన్ స్క్రీన్ పైన మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మొదటిది బ్యాంక్ బ్యాలెన్స్ ఆప్షన్ ఉంటుంది.
 
1. ఎకౌంట్ బ్యాలెన్స్
2. మినీ స్టేట్మెంట్
ఇలా మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మీకు కావాల్సిన నెంబర్ ఎంచుకుని ఆ నెంబర్‌ను రిప్లై చేస్తే చాలు. వెంటనే మీ ఎకౌంట్ నెంబర్‌తో పాటు మీ బ్యాంక్ బ్యాలెన్స్ డిస్‌ప్లే అవుతుంది. చాలా ఈజీగా ఉంది కదా.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments