టెక్ ప్రపంచంలో ఇంటర్నెట్ ఒక్క నిమిషం ఆగిపోతే.. ఇవన్నీ ఆగిపోతాయి
కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది. మారుమూల గ్రామాల్లోకి సైతం ఇది చొచ్చుకుని పోయింది. ఏం చేయాలన్నా.. ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా.. ఇంటర్నెట్ సాయంతోనే ఆర్డర్లిస్తూ.. తమ పనులను
కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ అత్యంత కీలక పాత్రను పోషిస్తోంది. మారుమూల గ్రామాల్లోకి సైతం ఇది చొచ్చుకుని పోయింది. ఏం చేయాలన్నా.. ఏం కొనాలన్నా.. ఏం తినాలన్నా.. ఇంటర్నెట్ సాయంతోనే ఆర్డర్లిస్తూ.. తమ పనులను ఇంటిపట్టునే ఉంటూ చక్కబెట్టేస్తున్నారు.
ఇక సోషల్ మీడియా జోరు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నెటిజన్లను 24 గంటలూ నెట్టింట్లోనే గడిపేలా చేస్తున్నాయి. ఇందుకోసం ఇంటర్నెట్ అంతగా వాడేస్తున్నాం. మరి అలాంటి ఇంటర్నెట్ సదుపాయం ప్రపంచమంతా ఒక్కసారిగా నిలిచిపోతే..? ఇది ఊహకే అందని ప్రశ్న.
కానీ.. ఈ కింది లెక్కలు చూస్తే అర్థమవుతుంది.. కేవలం ఒక్క నిమిషం పాటు ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోతే ఏం జరుగుతుందనేదానిపై 'ఇంటర్నెట్‌లైవ్‌స్టాట్స్.కాం'తో పాటు.. 'ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స్' సంస్థలు వెల్లడించిన వివరాలు..