Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల చిన్నారి వార్షిక ఆదాయం అక్షరాలా రూ.155 కోట్లు... ఎలా?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (17:39 IST)
అమెరికాకు చెందిన ఏడేళ్ల చిన్నారి వార్షిక ఆదాయం ఎంతో తెలిస్తే షాకవుతారు. అవును నిజమే.. ఎనిమిదేళ్ల చిన్నారికి వార్షిక ఆదాయం అక్షరాలా రూ.155 కోట్లు. రోజుకు రూ.500 సంపాదించేందుకు ఎన్నో కష్టాలు పడే ప్రజలకు ఆరేళ్ల చిన్నారి వార్షిక ఆదాయం గురించి వింటే షాక్ తప్పదు.
 
రియాన్ అనే చిన్నారి తాను ఆడుకునే బొమ్మల వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఏడాదిలోనే కోట్లాది రూపాయలను ఆదాయంగా పొందాడు. అమెరికాకు చెందిన రియాన్ అనే ఈ చిన్నారి.. ఒక బొమ్మను కొనేముందు.. దాని విలువ ఏంటో తెలుసుకున్నాకే దాన్ని కొంటాడు. దీంతో పాటు రియాన్ తన తల్లిదండ్రుల సాయంతో గత మార్చి 2015వ సంవత్సరంలో రియాన్ టాయ్స్ రివ్యూ అనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. 
 
ఆరంభంలో రియాన్ వీడియోలకు ఆదరణ లభించకపోయినా.. ఆతని తల్లిదండ్రులు రోజుకో వీడియో చొప్పున పోస్టు చేయడం ద్వారా సక్సెస్ అయ్యారు. తద్వారా రియాన్ పాపులర్ అయ్యాడు. జూలై 2015వ సంవత్సరం పోస్టు చేయబడిన రియాన్ జియంట్ అనే వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోకు 800 మిలియన్ల వ్యూస్ లభించాయి. 
 
ఈ నేపథ్యంలో రియాన్ యూట్యూబ్ ఛానల్‌ను ఇప్పటివరకు 70లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేశారు. తద్వారా 2017-2018వ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.155 కోట్ల ఆదాయాన్ని రియాన్ పొందాడు. దీంతో రియాన్ యూట్యూబ్‌లో అత్యధిక ఆదాయం సంపాదించిన ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments