షార్ట్ వీడియోల మార్కెట్‌‌లోకి యూట్యూబ్.. మార్చి నెలలో లాంచ్ అవుతుందా?

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (18:36 IST)
భారత్‌లో టిక్‌టాక్ వదిలి వెళ్లిన షార్ట్ వీడియోల మార్కెట్‌ను కైవసం చేసేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే 'రీల్స్' పేరిట ఇన్‌స్టాలో షార్ట్ వీడియోలను ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్.. టిక్‌టాక్ యూజర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ కూడా ఈ మార్కెట్‌లో వాటాకోసం ప్రయత్నిస్తోంది. షార్ట్ వీడియో ఫార్మాట్‌కు మంచి డిమాండ్ ఉన్న భారత్‌లో యూట్యూబ్ ఇప్పటికే 'షార్ట్స్' పేరిట కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 
 
ప్రస్తుతం ఇది బీటా మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిపై ప్రస్తుతం ప్రజల రెస్పాన్స్‌ను విశ్లేషిస్తోంది. యూట్యూబ్ షార్ట్స్‌ వీడియోలకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3.5 బిలియన్ వ్యూస్ వస్తున్నాయని సంస్థ ఇటేవలే ప్రకటించింది. 
 
ఈ క్రమంలో ఈ ఫార్మాట్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతున్న యూట్యూబ్ తాజాగా అమెరికాలోనూ ఇది అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోందని సమాచారం. మరి కొద్ది వారాల్లో బీటా మోడ్‌లో దీన్ని లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. మార్చి నెలలో ఇది లాంచ్ కావచ్చనేది మార్కెట్ నిపుణులు అంచనాగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments