ఆన్‌లైన్‌లో జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను ఇలా బుక్ చేసుకోండి...

దేశ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న స‌మ‌యం వ‌చ్చేసింది. గురువారం నుంచి జియో ఉచిత ఫోన్ బుకింగ్స్ ప్రారంభ‌మ‌వుతున్నాయి. సాయంత్రం 5.30 గంట‌ల నుంచి బుకింగ్ మొద‌లువుతుంది. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో కూడా

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (12:09 IST)
దేశ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న స‌మ‌యం వ‌చ్చేసింది. గురువారం నుంచి జియో ఉచిత ఫోన్ బుకింగ్స్ ప్రారంభ‌మ‌వుతున్నాయి. సాయంత్రం 5.30 గంట‌ల నుంచి బుకింగ్ మొద‌లువుతుంది. ఈ ఫోన్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో కూడా బుక్ చేసుకోవచ్చు. 
 
ఆన్‌లైన్‌లో బుక్ చేయదలచుకున్న వారు ముందుగా ఆన్‌లైన్‌లో ప్రీ రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఆఫిషియ‌ల్ వెబ్‌సైట్ jio.comను విజిట్ చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభంకాగానే, హోమ్‌పేజీపై ఇమేజ్ లేదా బ‌ట‌న్ డిస్‌ప్లే అవుతుంది. జియో ఫ్రీ మొబైల్ ఫోన్ రిజిస్ట్రేష‌న్‌ లేదా ప్రీ బుకింగ్ బ‌ట‌న్‌ను క్లిక్ చేయాలి. అందులో పూర్తి స‌మాచారాన్ని ఎంట‌ర్ చేయాలి. 
 
కాంటాక్ట్ నెంబ‌ర్‌, షిప్పింగ్‌ అడ్ర‌స్ కూడా నమోదు చేయాలి. క్రెడిట్‌, డెబిట్‌, నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.1500 చెల్లించాలి. ఆ త‌ర్వాత జియో ఫోన్ బుకింగ్ జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్‌లో జియో ఫోన్ డెలివ‌రీ మొద‌ల‌వుతుంది. మైజియో యాప్ నుంచి కూడా జియో ఫ్రీ ఫోన్ బుకింగ్ చేసుకునే స‌దుపాయం కల్పించారు. 
 
ఇకపోతే.. ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఆథ‌రైజ్డ్ జియో రిటేల‌ర్ లేదా రిల‌య‌న్స్ డిజిటల్ ఔట్‌లెట్‌కు వెళ్లి బుక్ చేసుకోవాలి. ఫోన్ బుక్ చేసుకునేందుకు ఆధార్ నెంబ‌ర్ ఖచ్చితం. ఒక్కో ఆధార్ కార్డుకు ఒక్క ఫోన్ మాత్రమే ఇస్తారు. ఆధార్ డిటేల్స్ ఇచ్చిన త‌ర్వాత ఆ స‌మాచారం సెంట్ర‌లైజ్డ్ సాఫ్ట్‌వేర్‌కు అప్‌లోడ్ అవుతుంది. ఆ త‌ర్వాత మీకు టోకెన్ నెంబ‌ర్ వ‌స్తుంది. ఫోన్ డెలివ‌రీ స‌మ‌యంలో ఈ నెంబ‌ర్ అవ‌స‌రం ఉంటుంది. ఇందుకోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.1000ని ఫోన్ డెలివరీ సమయంలో చెల్లించి ఫోన్‌ను పొందవచ్చు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments