వాట్సాప్‌లో నయా ఫీచర్.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (11:24 IST)
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ అద్భుతమైన ఫీచర్ వాట్సాప్ వినియోగదారులకు ఎంతో అనుకూలంగా ఉండనుంది. ఇతరులకు పంపే లేదా మనకు వచ్చే మెసేజ్‌లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా ఓ ఫీచర్‌ను వాట్సాప్ యాజమాన్యం తయారు చేస్తోంది. 
 
నిజానికి కుప్పలు తెప్పలుగా ఫోనుకు మెసేజ్‌లు వస్తుంటాయి. వీటితో ఫోన్ మెమరీ కుంచించుకు పోతుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశా అడుగులు వేస్తోంది వాట్సాప్ యాజమాన్యం. మనం పంపే సందేశాలు నిర్ణీత సమయం తర్వాత మాయమయ్యే సదుపాయాన్ని అభివృద్ధి చేస్తోంది. 
 
ఇప్పటికే మనం పంపే మెసేజ్‌లను గంట సేపటిలోగా ఎప్పుడైనా డిలీట్‌ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆటోమెటిక్‌గా సందేశాలు డిలీట్‌ అయ్యేలా వాట్సప్‌ సంస్థ 'డిసప్పియరింగ్‌ మెసేజెస్‌' పేరుతో సరికొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నది. 
 
సెట్టింగ్స్‌లోకి వెళ్లి మనం మెసేజ్‌ పంపిన తర్వాత ఐదు సెకండ్ల నుంచి గంటలోపు.. ఎంత సమయంలో అదృశ్యం కావాలో ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రయోగదశలోనే ఉన్నది. ఇప్పుడు గ్రూప్‌ మెసేజ్‌లకు మాత్రమే ఈ సదుపాయం ఉంది. పంపిన సందేశాలు ఆటోమెటిక్‌గా అదృశ్యమయ్యే ఆప్షన్‌ ఇప్పటికే జీమెయిల్‌, టెలిగ్రామ్‌ చాట్‌ వంటి యాప్‌లలో అందుబాటులో తెచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments