Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్లు.. వకేషన్ మోడ్, న్యూ యూఐ

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (12:41 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి, ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త అప్ డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ఫీచర్లలో వకేషన్ మోడ్, న్యూ యూఐ లాంటి మరిన్ని ఫీచర్లు ఉంటాయి.  
 
ఎంతగానో ఎదురుచూస్తోన్న కొత్త ఫీచర్.. వకేషన్ మోడ్. ఇదివరకే చాట్ చేసిన మెసేజ్‌లను అదే.. ఆర్క్యూడ్, చాట్ మెసేజ్‌లను మ్యూట్ చేస్తుంది. చాట్‌కు సంబంధించి ఆర్క్యూడ్ చేసిన వాటిలో కొత్త మెసేజ్‌లు వచ్చినప్పటికీ కూడా మ్యూట్‌లో ఉంచుతుంది. ఒకవేళ ఏదైనా ఒక చాట్.. వ్యక్తిగత చాట్ లేదా గ్రూపు చాట్‌లో కొత్త మెసేజ్ రాగానే వెంటనే మీకో పాప్ అప్ వస్తుంది.  
 
వాట్సాప్ అందించే డిఫాల్ట్ వాల్ పేపర్లు వాడుతున్నారా? ఆ వాల్ పేపర్లనే మీ వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్‌లో వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. వాట్సాప్ మీ కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఒక్కో చాట్ బాక్సులో వేర్వేరు బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉంది. రెగ్యులర్ లేదా బీటా యూజర్ల కూడా అందుబాటులో లేదు. అతి త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
 
వాట్సాప్ అకౌంట్లో స్టోరేజ్ యూసేజ్ సెక్షన్ చూసే ఉంటారు.. దీన్ని వాట్సాప్ సరికొత్తగా రూపొందిస్తోంది. కొత్త డిస్ ప్లే రాబోతోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ స్టోరేజీని సులభంగా వినియోగించుకోవచ్చు. ఫోన్ స్టోరేజీలో తిష్టవేసిన అవసరంలేని చెత్త ఫైళ్లను డిలీట్ చేసుకోవచ్చు. డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం.. వాట్సాప్ యూఐలో కాల్ స్ర్కీన్‌లో కింది భాగంలోకి ఎలిమెంట్స్ మూవ్ చేస్తోంది. అతి త్వరలో ఈ ఫీచర్ రిలీజ్ కానుంది.
 
వాట్సాప్ ఇటీవలే యానిమేటెడ్ స్టిక్కర్లు అనే ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనికి కొత్త యానివేషన్ టైప్ తీసుకొస్తోంది. యానిమేటెడ్ స్టిక్కర్లను యాడ్ చేస్తోంది. ఒకసారి ఈ యానిమేటెడ్ స్టిక్కర్లను ఇప్పుడు చాట్ బాక్సులోకి పంపితే 8 సార్లు లూప్ అవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments