వాట్సాప్ సంస్థ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ పేరిట కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో వీడియోలను మరో యాప్‌కి రీడైరక్ట్ కాకుండానే వాట్సాప్‌లోనే ప్రత్యేక విండోలో చూసే వీలుంటుంది. ఇతరులతో చాటింగ్ చేస్తూనే థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలని వాట్సాప్‌లో ప్లే చేసుకోవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్‌లో వర్షన్ 2.18.380కి అప్ డేట్ చేసుకున్నవాళ్లు ఈ సదుపాయాన్ని పొందుతారు. కాగా ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకి ఈ ఫీచర్ అందుబాటులోకి వుంటుందని వాట్సాప్ సంస్థ వెల్లడించింది. గ్రూప్ ఛాట్, వ్యక్తిగత ఛాట్‌లను కూడా ఈ ఫీచర్ వర్తిస్తుంది. ఒకసారి లింక్ ఓపెన్ చేశాక ఇది స్మాల్ స్క్రీన్‌లో ప్లే అవుతూ వుంటుంది. ఆపై చాట్ చేసుకోవచ్చునని వాట్సాప్ తెలిపింది.