Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నాప్‌షాట్‌‌లో కొత్త ఫీచర్లు.. వాయిస్ కమాండ్ ద్వారా ఇవన్నీ చేయొచ్చు..

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:45 IST)
Snapshot
గూగుల్ అసిస్టెంట్ గురించి అందరికీ తెలిసిందే. వాయిస్ కమాండ్స్, టెక్ట్స్ కమాండ్స్ రూపంలో ఏదైన సమాచారం అడిగితే మీకు అది అందిస్తుంది. కానీ హే గూగుల్, ఓకే గూగుల్ అంటే అసిస్టెంట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ స్క్రీన్‌ను స్నాప్‌షాట్‌ అని అంటారు. గూగుల్‌ ఈ పేజీలో మార్పులు చేస్తోంది. తాజాగా యూజర్‌కు మరింత ఉపయోగపడేలా ఇందులో కొత్త కొత్త ఫీచర్లు యాడ్‌ చేస్తోంది. 
 
స్నాప్‌షాట్‌ను యూజర్లు వినియోగించేందుకు గూగుల్‌ నూతనంగా వాయిస్‌ కమాండ్‌ను తయారు చేసింది. ఈ రోజు మీరు చేయాల్సిన పనులేంటి, మీ స్నేహితుల పుట్టిన రోజులేంటి, చెల్లించాల్సిన బిల్స్‌, మీ వార్షికోత్సవాలు ఇలా చాలా ఆప్షన్లను ఈ స్నాప్‌షాట్‌లో పొందుపరుస్తున్నారు. అదనపు ఆప్షన్ల గురించి చూస్తే రిజర్వేషన్లు, తరచుగా వాడే అసిస్టెంట్‌ యాక్షన్లు/కమాండ్లు, కరెన్సీ కన్వర్టర్‌ లాంటివి ఉన్నాయి.
 
హే గూగుల్‌/ఓకే గూగుల్‌ కమాండ్‌తో గూగుల్‌ అసిస్టెంట్‌ను ఓపెన్‌ చేసి 'హే గూగుల్‌ షో మి మై డే' అనాలి. అప్పుడు స్నాప్‌షాట్ తెర మీద సమాచారం కనిపిస్తుంది. సాధారణంగా యూజర్లకు వాతావరణం, రిమైండర్స్‌, షాపింగ్‌ లిస్ట్‌, కోవిడ్‌ సమాచారం లాంటివి డీఫాల్ట్‌గా ఇస్తున్నారు. ఇవి కాకుండా సెట్టింగ్స్‌ ద్వారా ఇంకొన్ని ఆప్షన్లు యాడ్‌ చేసుకోవచ్చు లేదా తీసేయొచ్చు.
 
డీఫాల్ట్‌గా అయితే అందరికీ అన్ని ఆప్షన్లు ఆన్‌లో ఉంటాయి. ప్రస్తుతానికి స్నాప్‌షాట్‌ ఆంగ్లంలోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ సేవలు వినియోగించేలా గూగుల్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments