Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు షాక్.. రూ.99కే వోడాఫోన్ న్యూ ప్లాన్

రిలయన్స్ జియోకు షాకిచ్చేలా వోడాఫోన్ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదీకూడా రూ.99కే ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్‌ జియో 98, ఎయిర్‌టెల్‌ 99రూపాయల రీచార్జ్‌ ప్లాన్ తరహాలో కొత్త ప్లాన్

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (12:49 IST)
రిలయన్స్ జియోకు షాకిచ్చేలా వోడాఫోన్ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదీకూడా రూ.99కే ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్‌ జియో 98, ఎయిర్‌టెల్‌ 99రూపాయల రీచార్జ్‌ ప్లాన్ తరహాలో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.99కే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
 
అయితే, మిగిలిన ప్రైవేట్ టెలికాం కంపెనీలై ఎయిర్‌టెల్‌, జియో తరహాలో ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం మాత్రం ఇవ్వడం లేదు. ఇక ఈ ప్లాన్ కాలపరిమితిని 28 రోజులుగా నిర్ణయించినప్పటికీ రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్ మాత్రమే చేసుకునేలా నిబంధన విధించింది. వొడాఫోన్ వెబ్‌సైట్‌, యాప్‌లో ఈ ప్లాన్‌ను రీ ఛార్జి చేసుకునే ఆఫర్‌ కల్పించింది.
 
మరోవైపు 99 రూపాయలకు ఎయిర్‌టెల్‌ 1 జీబీ డేటా, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌ వాలిడిటీ 10 రోజులు మాత్రమే. ఇక జియో రూ.98 ప్లాన్‌లో 1 జీబీ డేటా, రోజుకు 300ఎస్‌ఎంఎస్‌లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments