Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ యూజర్లకు మరో ఫీచర్... వీడియో కాలింగ్ టెస్టింగ్ సక్సెస్

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టంట్ మెసెంజర్ వాట్సప్ త్వరలో వీడియో కాలింగ్ ఫీచర్‌ను వినియోగదారులకు అందించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉన్నట్టు సమాచారం. వాట్సప్ సంస్థకు

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (11:33 IST)
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టంట్ మెసెంజర్ వాట్సప్ త్వరలో వీడియో కాలింగ్ ఫీచర్‌ను వినియోగదారులకు అందించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా దశలో ఉన్నట్టు సమాచారం. వాట్సప్ సంస్థకు చెందిన కేవలం కొద్ది మంది ఉద్యోగులు ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. 
 
కాగా ఒకప్పుడు వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను కేవలం ఇన్విటేషన్ ప్రాతిపదికగా యూజర్లకు అందించిన వాట్సప్ ఇప్పుడు అదేవిధంగా వీడియో కాలింగ్ ఫీచర్‌ను కూడా అందించింది. వీడియోకాలింగ్‌తో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మరిన్ని ఫీచర్లను అందించే దిశగా వాట్సప్ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు లింక్‌లు, క్యూఆర్ కోడ్ల ద్వారా గ్రూప్ ఇన్విటేషన్లను పంపుతుండగా త్వరలో ఎన్‌ఎఫ్‌సీ ట్యాగ్‌ల ద్వారా ఆ ఇన్విటేషన్లను పంపేలా యూజర్లకు కొత్త సౌకర్యాన్ని అందించనున్నారు.
 
అయితే ప్రస్తుతం పరీక్షదశలో బీటా 2.16.316 ఆ తర్వాత వచ్చిన వర్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. అయితే మీరు వీడియో కాల్‌ చేసుకోవాలంటే ఖచ్చితంగా అవతలివారు కూడా ఈ వర్షన్లకు అప్‌డేట్‌ అయి ఉంటేనే కాల్ చేయడానికి వీలవుతుంది. ఇలాంటి కాంటాక్ట్స్‌కి కాల్‌క్లిక్‌ చేయగానే వీడియో లేదా వాయిస్‌ కాల్‌ అని అడుగుతుంది. దానిలో నచ్చినది ఎంచుకోవచ్చు. 
 
ప్రస్తుత వాట్సప్‌ కాల్‌ వలె ఎవరు అప్‌డేట్‌ చేసుకున్నారో తెలుసుకోవచ్చు. ఆయా కాంటాక్టల పక్కన వీడియో, ఆడియో సింబల్స్‌ కనిపిస్తుంది. కాల్‌ పూర్తయిన వెంటనే క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకునేందుకు యాప్‌ రేటింగ్‌, ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటుంది. ఈ క్రమంలో కొత్త ఫీచర్లతో కూడిన వాట్సప్ అప్‌డేట్ అవడంతో యూజర్లంతా హ్యాపీగా ఉన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments